Listen to this article

పశు మిత్రల యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు వెలిశాల క్రిష్ణమాచారి

జనం న్యూస్ జనవరి 20 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం సిఐటియు కార్యాలయంలోని పశుమిత్రల యూనియన్ సి.ఐ.టి.యు ఆధ్వర్యములో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పశుమిత్రల యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు వెలిశాల క్రిష్ణమాచారి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగాపశుమిత్రలుగ 2017 నుండి పనిచేస్తున్నారు. పశుమిత్రలను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని, మూగజీవులకు వైద్య సేవలు అందిస్తున్న పశుమిత్రులకు ప్రభుత్వం వేతనాన్ని నిర్ణయించి ఇవ్వకుండా పశువులకు వైద్యం చేయమని చెప్పడం సిగ్గుచేటు. గత అనేక సం,, రాలుగా మానవతా దృక్పథంతో పశుమిత్రలు వైద్య సేవలు అందిస్తున్నారు. కనీస వేతనం 26000 నిర్ణయించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పశు మిత్రలకు గుర్తింపు కార్డులు, పిఎఫ్ ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, పశుమిత్రలకు సం,,రానికి రెండు జతల యూనిఫాం, షూ అందించాలని,మెడికల్ కిట్, సరిపడే మెడిసిన్స్ ఇవ్వాలి. అదేవిధంగా పశు మిత్రలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో పశు మిత్రల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు వనితా, జిల్లా కార్యదర్శి శ్రీలత, కోశాధికారి పుష్ప కమిటీ సభ్యులు పాల్గొన్నారు.