Listen to this article

జనం న్యూస్ మే 11(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) సబ్జెక్టు : మునగాల సర్కిల్ పరిధిలోని మునగాల,నడిగూడెం,మోతే పోలీస్ స్టేషన్లలో గత వారం రోజుల నుంచి సూర్యాపేట జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు మైనర్ డ్రైవింగ్ చేసినటువంటి వ్యక్తుల యొక్క మోటార్ సైకిళ్లను పోలీస్ స్టేషన్లో పట్టుకొని శనివారం మునగాల సీఐ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మూడు మండలాలకు సంబంధించిన మైనర్ డ్రైవింగ్ చేసినటువంటి వ్యక్తులు మరియు వారి తల్లిదండ్రులు అందరినీ మునగాల సీఐ ఆఫీస్ లో కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సీఐ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఎవరైనా మైనర్ పిల్లలకి వెహికల్స్ ఇచ్చినట్లయితే వారి పైన కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకొని వారి వెహికల్స్ ని సీజ్ చేయడం జరుగుతుంది అలానే మైనర్స్ యొక్క పేరెంట్స్ పైన కూడా చట్ట ప్రకారం చర్య తీసుకొనబడుతుంది దాదాపుగా 40 మంది మైనర్ డ్రైవింగ్ చేసిన వ్యక్తులు మరియు 80 మంది వరకు వారి పేరెంట్స్ ఈ కౌన్సిలింగ్ లో పాల్గొనడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మునగాల మండల ఎస్సై ప్రవీణ్ కుమార్, నడిగూడెం మండల ఎస్సై అజయ్ కుమార్,పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.