Listen to this article
  • రాజకీయ నాయకుల అండదండతో యదేచ్చగా నల్లమట్టి రవాణా
  • చెరువు కుంటలను ధ్వంసం చేస్తున్న అక్రమార్కులు
  • ఎలాంటి అనుమతులు లేకుండా రాత్రివేళ హిటాచీలతో భారీ తవ్వకాలు
  • మల్కాపూర్, నుంచి పట్టణ ప్రాంతాలకు తరలింపు
  • రాత్రికిరాత్రే ఇటుక బట్టీలకు డంప్ చేస్తూ
  • సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులు
  • చోద్యం చూస్తున్న రెవెన్యూ, పోలీస్ నీటిపారుదల శాఖ అధికారులు

జనం న్యూస్. జనవరి 20. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్.(అబ్దుల్ రహమాన్)అక్రమార్కులు చెరువు కుంటలను చెరబట్టారు. నల్లమట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గ్రేటర్ పరిధిలోని ఇటుక బట్టీలకు విపరీతంగా నల్లమట్టి డిమాండ్ ఉండడంతో కొంతమంది రాజకీయ నాయకుల అండదండలతో గ్రామాల్లోని చెరువు కుంటలను ధ్వంసం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండల పరిధిలోని మల్కాపూర్ ఆయమ్మ చెరువు, తొపాటు తదితర గ్రామాల్లో రాత్రికిరాత్రే చెరువు కుంటలలో హిటాచీ జెసిబిల సహాయంతో నల్లమట్టిని తవ్వి పట్టణ ప్రాంతాలకు భారీ ఎత్తున రవాణా చేస్తున్నారు.దీంతో మట్టి వ్యాపారం మూడు పువ్వులు. ఆరు కాయలుగా కొనసాగుతుంది. ఇంత తతాంగం జరుగుతున్నా రెవెన్యూ, పోలీస్. నీటిపారుదల శాఖ అధికారులు మాత్రం నిద్రమత్తు వీడడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మల్కాపూర్ అయ్యమ్మ చెరువు విస్తీర్ణం సుమారు 56 ఎకరాల పైబడి ఉన్నది, అందులో నుంచి రాత్రి వేళలో జోరుగా నల్లమట్టిని తవ్వి సుమారు 40 నుండి 50 టిప్పర్ల సహాయంతో మట్టిని తరలిస్తు మట్టి మాఫియా పెట్రేగిపోతుందని రాత్రి సమయంలో మట్టిని తరలిస్తున్న టిప్పర్లు అతివేగంగా వెళ్లడంతో అటు ప్రజలు ఇటు వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ ఆదాయానికే గండి కొడుతూ నిబంధనలను తుంగలో తొక్కి చెరువు కుంటలను ధ్వంసం చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు, ఇప్పటికైనా ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసు అధికారులు స్పందించి అక్రమార్కుల ఆగడాలపై బ్రేకులు వేసి చెరువు కుంటలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు,,