Listen to this article

జనం న్యూస్ 11 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

కుటీల పాక్ కు చెక్ పెట్టాల్సిందే :-

కాల్పులు విరమణ ప్రకటించిన జాగ్రత్త అవసరం

దేశం కోసం ప్రాణాలు అర్పించేందుకైనా సిద్ధమంటున్న జిల్లా మాజీ సైనికులు..

యుద్ధానికి సై అంటూ డబ్బాలు పలికిన పాక్ ఇప్పుడు కాల్పులు విరమణ పాట పాడుతున్న దాని వెనుక కుటిలత్వం ఉన్నది. అదను చూసి మళ్లీ దొంగ దెబ్బ తీయడానికి ఏమాత్రం వినకూడదు. దాయిది దేశంతో ఇటువంటి అనుభవాలు గతంలో ఎదుర్కొన్నవే. అందువల్ల భారత్ తన జాగ్రత్తలో ఉండాలని. మాజీ సైనికుడిగా కోరుతున్నాను. పాకిస్తాన్ పీచమనిచేందుకు తాను కూడా సిద్ధమేనని సమరోత్సహాన్ని ప్రదర్శిస్తున్నాను..కాల్పుల విరమణకు అంగీకారం తెలిపిన దొంగ దెబ్బ తీసే పాకిస్తాన్ ను నమ్మకూడదు. ఇండియా, పాకిస్తాన్ ఉద్రిక్తత నేపథ్యంలో దేశం తరఫున పోరాడేందుకు తాను సిద్ధమని మాజీ సైనికుడిగా నేను ముందుంటాను. విజయనగరం జిల్లాలో అనేకమంది త్రివిధ దళాల్లో పనిచేసిన మాజీ సైనికులు కూడా వెనుకడుగు వేసేది లేదంటున్నారూ. మాజీ సైనికుల్లో అనేక ర్యాంకులతో ఉద్యోగ విరమణ చేసిన తమలో సత్తా తగ్గలేదని చెబుతున్నారు. కార్గిల్ ఇతర ఆపరేషన్ లో చేసిన సమయాన్ని పనిచేసిన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ. ప్రస్తుతం పని చేస్తున్న సైనికులతో కలిసి శత్రువులను మట్టి కరిపిస్తాము.