Listen to this article

జనం న్యూస్ మే 11 ముమ్మిడివరం ప్రతినిధి


కాట్రేని కోన: కుండలేశ్వర గ్రామం శ్రీ పార్వతీ కుండలేశ్వరం శివమాలయంలో భారత సైన్యానికి, దేశ ప్రధాని

నరేంద్ర మోదీకి భగవంతుని ఆశీస్సులు కలగాలని కుండలేశ్వర స్వామి ఆలయంలో బీజేపీనాయకులు ప్రత్యేక పూజలు నిర్వహింశారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాబిజెపి ట్రెజరర్ గ్రంధి నానాజీ ఆధ్వర్యంలో కుండ లేశ్వరం ఆలయంలో పూజలు నిర్వహించారు. బీజేపీ , మండల అధ్యక్షులు మట్ట శివకుమార్ ముమ్మిడివరం నియోజవర్గం కన్వీనర్ గొల్ల కోటి వెంకటరెడ్డి,ఈ సందర్భంగాకన్వీనర్ మాట్లా డుతూ దేశ రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న భారత సైన్యానికి తమ సంపూర్ణ మద్దతు ఉం టుందని తెలిపారు. పీఎం నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంకుండలేశ్వర స్వామి ఆలయంలో ప్రధాన అర్చకులు కాళ్ల కూరి కామేశ్వర శర్మ మరియు సూరిబాబు వారిచే ఆలయంలో అభిషేకం చేసినారు అమ్మవారికి భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో భారత్ విజయం సాధించాలనే ఆకాంక్షతోపాటు యుద్ధం లో భారత్ సైనికుల అండగా నిలవాలని ఆ స్వామిని కోరుతూ ఈ పూజలు చేశారు. కార్య క్రమంలో సర్పంచ్ , కూటమి నాయకులు పాల్గొన్నారు.