Listen to this article

జనంన్యూస్. 11.నిజామాబాదు. ప్రతినిధి.

నిజామాబాదు. ఇండియా – పాకిస్తాన్ మధ్య జరుగుతున్నా యుద్ధం నేపథ్యంలో భారత త్రివిధ దళాల సైన్యానికి మనోధైర్యం ప్రసాదించాలని, భారత భూబాగానికి, దేశ ప్రజలకు ఎటువంటి నష్టం జరగకూడదని ఈ యుద్ధంలో భారత్ ఘన విజయం సాధించాలని ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ .మల్లారం దత్త గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతు ఈ యుద్ధంలో భారత్ సైన్యనికి, భారత భూబాగానికి, దేశ ప్రజలకు ఎటువంటి నష్టం జరగకుండా కుల, మతాలకు అతీతంగా ప్రతి భారతీయుడు దగ్గర్లో ఉన్న మందిరాలలో ప్రత్యేక పూజలు నిర్వహించాలని అన్నారు.కాశ్మీర్ లో పహాల్గం ఘటన తరువాత ప్రతి భారతీయునిలో మరిగిన రక్తనికి, ఆవేదనకు ప్రతీకారంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కు తగిన గుణపాఠం చెప్పడానికి భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ నిర్వహించడం అనేది భారత్ శక్తి – యుక్తులకు నిదర్శనం అన్నారు.ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నా పాకిస్తాన్ భారత్ చర్యను భరించలేక భారత దేశంపైన, మన పౌరులపైన దాడులకు పాల్పడటాన్ని భారత్ త్రివిధ దళాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయన్నారు.కాల్పుల విరమణ ఒప్పందం చేసుకొని మళ్ళీ భారత్ పై దాడులు చేయడం పాకిస్తాన్ వంకర బుద్ది, ప్రపంచదేశాలకు స్పష్టం అయిందన్నారు.
ఉగ్రవాదానికి మద్దతు ఇస్తూ భారత్ పైన దాడి చేసే శత్రు దేశాలకు భారత్ సైన్యం తగిన బుద్ది చెప్తుందని అన్నారు.భారత్ శత్రు దేశాలు మన వైపు కన్నెత్తి చూడాలన్నా ఇక్కడ ఉన్న ఒక్క భారతీయున్ని ముట్టుకోవాలన్నా ఇది ఒక మోదీ గారి హెచ్చరిక అని అన్నారు.భారత్ సైన్యం తలుచుకుంటే పాకిస్తాన్ ను ఇండియా పఠంలో లేకుండా చేస్తుందని భారత దేశ ప్రజలందరు మోదీ గారికి కేంద్రప్రభుత్వానికి అండగా ఉన్నారన్నారు ప్రపంచ దేశాలు సైతం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ కీ మద్దతు ఇస్తున్నాయని అన్నారు.పాకిస్తాన్ పైన భారత్ ఘన విజయం సాధించి ఉగ్రవాదుల నెత్తుటితో భారత మాతకు వీర తిలకం దిద్దడమే ఆపరేషన్ సిందూర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.