Listen to this article

జనం న్యూస్ మే 12( ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ)

కాట్రేనికోన

వేసవి సెలవుల్లో పిల్లలకు చదువుల భారం తగ్గిపోయి సెలవు రోజుల్లో హాయిగా గడపడానికి వివిధ చోట్లకి వెళుతుంటారు.వీధుల్లో ఆటలు ఆడుకోవడానికి చెరువుల్లో, బావుల్లో, కాలువలో, ఈతకని, ద్విచక్ర వాహనాల పై స్వారీలు అంటూ కరసత్తులుచేస్తుంటారు. ఈ కరసత్తులు చేసే పిల్లలపట్ల తల్లిదండ్రులు జర జాగ్రత్తగా వహించండి. అంటూ ఆదివారం ఒక పత్రిక ప్రకటనలో కాట్రేను కోన ఎస్సై ఐ అవినాష్ పిల్లలను దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులకు జాగ్రత్తలను సూచించారు.అసలే ఎండాకాలం కావడంతో పిల్లలు దానిని లెక్కచేయకుండా ఆటలాడుతుంటారు,గ్రామీణ ప్రాంతాలలో ఉండే పిల్లలు చెరువుల్లో,బావుల్లో,ఈతలు అంటూ ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయి తల్లిదండ్రులకు దుఃఖాన్ని మిగిల్చిన సంఘటనలు లేకపోలేదు.తల్లిదండ్రులు పిల్లలను చెరువులు, బావుల వద్దకు వెళ్లకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలి. అవసరమైతే తమ పిల్లలకు దగ్గరుండి రక్షణ చర్యలు తీసుకుంటూ ఈత నేర్పించాలి.ఈత వచ్చిందని వదిలేస్తే ఈతరాని వారితోనే ప్రమాదం ఉంటుందని గ్రహించాలి.సరదాగా వెళ్లి విషాదం జరగకుండా చూసుకోవాలి.. ఎండలో ఆటలు ముప్పే… వేసవి సెలవులు పిల్లలందరూ కలిసి ఆడుకునే ఆటల పై ఆసక్తి చూపుతారు. క్రికెట్, గిల్లి దండ, గోలీల ఆటలతో పాటు పొలాల వెంట తిరుగుతూ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలో ఆటలు ఆడుతుంటారు.ఎండలు తీవ్రంగా ఉండడంతో వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లలను ఎండలో తిరగనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అంటూ సూచిస్తున్నారు. ఇంటి ఆవరణలో చెట్ల నీడన చిన్నారులు ఆడుకునేలా చర్యలు తీసుకోవాలి.ఇంట్లోనే ఉండి ఆడుకునే ఆటలు ఎన్నో ఉంటాయి. చెస్, క్యారం బోర్డ్, వైకుంఠపాళీ వంటి ఆటల పై అవగాహన కల్పించాలి. ఇంటి పట్టునే ఉండేలా చేయడంతో ఈ ఆటలతో పిల్లల మేధస్సు పెరగడంతో పాటు ఆరోగ్యంగా ఉండేందుకు కృషి చేసినట్లు అవుతుంది.. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదు.. సెలవు రోజులు కావడంతో అందరూ ఇంటి దగ్గరే ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో పిల్లలు ఇంట్లో ఉండే వాహనాలు నడపడానికి ప్రయత్నిస్తుంటారు. పెద్దవారికి చెప్పకుండా వాహనాలు తీసుకెళ్లడానికి. లేదా పెద్దలే తన పిల్లలకు సరదా కోసం వాహనాలు ఇవ్వడం పరిపాటిగా మారుతుంది. చిన్నారులు వాహనాలు తీసుకొని రోడ్డు ఎక్కి ప్రమాదాలు బారిన పడే అవకాశాలు ఉన్నాయి. తల్లిదండ్రులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు.తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.