Listen to this article

పేద, నిరుపేద ప్రజలకు సీఎం సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తుందని *భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈరోజు సోమవారం భూపాలపల్లి మంజూరునగర్ లోని ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో భూపాలపల్లి కి సంబంధించిన మొత్తం 35 మందికి సీఎంఆర్ఎఫ్ లబ్దిదారులకు రూ.14,78,500 విలువ కలిగిన చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం సహాయనిధి ద్వారా పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. ఆపదలో సీఎం సహాయనిధి ఆపద్బాంధులా ఆదుకుంటుందని తెలిపారు. మానవతా దృక్పథంతో సీఎం రేవంత్ రెడ్డి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయాన్ని మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. పేద ప్రజలను ఆదుకునేందుకు ప్రజా ప్రభుత్వ అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. యువతకు ఉద్యోగాల కల్పనే ప్రజా ప్ర‌భుత్వ ధ్యేయంనిరుద్యోగ యువ‌తీ యువ‌కుల‌కు ఉపాధి, ఉద్యోగావ‌కాశాల‌ను క‌ల్పించ‌డ‌మే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్ర‌భుత్వం ప‌నిచేస్తోంద‌ని ఎమ్మెల్యే జీఎస్సార్ అన్నారు. ఇటీవల పుష్ప గ్రాండ్ కన్వెన్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన జాబ్ మేళాలో వివిధ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు పొందిన మొత్తం 146 మందికి ఈరోజు ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో ఆఫర్ లెటర్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ చదివిన నిరుద్యోగ యువత దాదాపుగా రాష్ట్రంలో 25 నుంచి 30 లక్షల వరకు ఉంటారని అన్నారు. నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలోనూ ఉద్యోగావకాశాలను కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. భ‌విష్య‌త్ అంతా డిజిట‌ల్ యుగంగా మార‌బోతోంద‌ని తెలిపారు. ఈనేప‌థ్యంలో వివిధ రంగాల్లో వ‌స్తున్న మార్పుల‌కు అనుగుణంగా యువ‌త‌లో సాంకేతిక నైపుణ్యం పెంపొందించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అన్నారు. యువ‌త‌ ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకునేందుకు నైపుణ్యాలను పెంపొందించడానికి ప్రభుత్వం హైదరాబాద్లో స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసింద‌న్నారు. స్కిల్ యూనివ‌ర్సిటీ అనేది దేశంలో మరెక్కడా లేద‌ని అన్నారు. స‌మీప భ‌విష్య‌త్‌లోనే అన్ని జిల్లాల్లో స్కిల్ డెవలప్‌మెంట్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేయ‌బోతున్న‌ట్లు తెలిపారు. డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ ని అందుబాటులోకి తీసుకువ‌చ్చామ‌ని అన్నారు. రాష్ట్ర ప్రగతిలో యువత భాగస్వామ్యం కావాలన్నారు. యువత భవిష్యత్తు పట్ల పరిశ్రమలను తీసుకువచ్చి తద్వారా లక్షలాదిమందికి ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు పట్టణ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు.