

జనం న్యూస్ 13 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
మండలంలోని కుంటినవలస గ్రామానికి చెందిన కొల్లి రాంబాబు పిడుగుపాటుకు మృతి చెందడంతో కుంటినవలస గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. వివరాల్లోకెళ్తే కుంటిన వలస గ్రామానికి చెందిన రాంబాబు మరో ఇద్దరు స్నేహి తులు పోరం లోవ పరిసర ప్రాంతాలలో పని చేస్తుండగా ఆకస్మాత్తుగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం రావడంతో దగ్గరే ఉన్న ట్రాక్టర్ తోటి కింద ఉండగా భయంకరమైన శబ్దంతో ట్రాక్టర్ పైన పిడుగు పడటంతో ముగ్గురిలో ఒకరు కొల్లి రాంబాబు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు తీవ్ర గాయాలు అయ్యాయి. మరొకరు ప్రాణాలతో బయటపడగా గాయాలు కలిగిన వ్యక్తిని ఉటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మృతుడి రాంబాబు భార్యకొల్లి కొండమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆండ్ర ఎస్సై సీతారాం తెలిపారు.