Listen to this article

( జనం న్యూస్ చంటి)

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు భారీగా పెరగాలని గ్రామాల్లో విద్యార్థుల తల్లిదండ్రులను ఇంటింటికీ కలిసి ప్రభుత్వ పాఠశాల యొaక్క ప్రాముఖ్యతను వివరించాలని ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలే అద్భుతంగా పనిచేస్తున్నాయని ప్రతి ఇంటికి ప్రచారం చేయాలని మండల విద్యాధికారి గజ్జెల కనకరాజు అన్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి విద్యార్థుల ప్రవేశాలు ఎక్కువగా జరగాలని అదేవిధంగా బడి బయట పిల్లలు ఎవ్వరు ఉండకూడదని ప్రతి గ్రామంలో బడిబాట కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని సూచించారు ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేయాలని కచ్చితంగా గుర్తింపు వస్తుందని సూచించారు. అదేవిధంగా పాఠ్యపుస్తకాలు ఏకరూప దుస్తులు సమయానికి విద్యార్థులకు చేరేటట్లు ఏర్పాటు జరుగుతున్నాయని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు గోపాల్ రెడ్డి, అప్జల్ హుస్సేన్ అన్నీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మండల వనరుల కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.