Listen to this article

చిన్నపాటి వర్షానికి కూకట్ పల్లి ప్రాంతంలో సోమవారం భారీగా నీటి నిల్వలు ఏర్పడి ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. వర్షం తక్కువగానే ఉన్నప్పటికీ, రోడ్లన్నీ చెరువులాగా మారీ వరద నీరు ఇళ్లల్లోకి వచ్చి ఇంట్లోనీ వస్తు సామాగ్రి అన్ని పాడైపోయాయి. వరద నీరుతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న బిజెపి నాయకులు ఘటన స్థలానికి వెళ్లి ప్రజలను పరామర్శించారు, బియ్యంతో పాటు వంట సామాగ్రి అన్ని పాడైపోవడంతో, నష్టపోయిన కుటుంబానికి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు ఆర్థిక సహాయం ఇచ్చి ఆసరాగా నిలిచారు, అనంతరం వారు మాట్లాడుతూ ఈ పరిస్థితికి ప్రధాన కారణం హైడ్రా పనులను ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా ప్రారంభించడమేనని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోకపోవడం చెరువులోని మట్టిని తవ్వి గుట్టలుగా పోయడం వల్ల డ్రెయినేజీ వ్యవస్థ నిలిచిపోయింది. ప్రజల జన జీవనం అతలాకుతలమైందనీ వారు తెలియజేశారు, స్థానిక పాలకులు, జీహెచ్ఎంసీ అధికారులు తక్షణమే స్పందించి హైడ్రా పనుల సమర్థవంతమైన నిర్వహణకు చర్యలు తీసుకోవాలని, వర్షాకాలం ముందు డ్రెయినేజ్ వ్యవస్థను పునరుద్ధరించాలని రాజేశ్వరరావు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులు ప్రమాదంలో పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత అని వారు స్పష్టం చేశారు.అలాగే చెరువుల సుందరీకరణ పనులను మేము స్వాగతిస్తున్నాము కానీ పట్టాలు కలిగిన రైతులు భూములు నష్టపోతున్న సందర్భంగా వారికి తగిన నష్టపరిహారం అందించలని ఆ తర్వాత పనులు ప్రారంభిస్తే బాగుండేదని వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి బిజెపి అసెంబ్లీ ఇంచార్జ్ మాధవరం కాంతారావు, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్శనపల్లి సూర్యారావు, అసెంబ్లీ కన్వీనర్ శ్రీకర్ రావు, డివిజన్ అధ్యక్షుడు అనంత నాగరాజు, డివిజన్ నాయకులు దుర్గాప్రసాద్ రావు శంకర్ రెడ్డి విశాల్ సాగర్ క్రాంతి కుమార్ అశోక్, నల్లచెరువు రైతు కుటుంబలు, వెంకట్రావు నగర్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.