

జనం న్యూస్ జనవరి 21 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి : పాపిరెడ్డి నగర్ శ్రీ వీరాంజనేయ శివాలయ దేవాలయ ముఖ్య సలహాదారుడు 72 వయస్సు గల శ్రీ మాదాసు అనంత రాములు మరియు వారి సతీమణి సువర్ణ పుణ్య దంపతులు మహాకుంభమేళ పుణ్య నదులలో మూడు పర్యాయాలు స్నానమాచరించి మరియు ఆ మహా దేవుడు కాశీ విశ్వేశ్వర పుణ్యక్షేత్రం 55 పర్యాయాలు దర్శించుకుని ఈరోజు తిరుగు ప్రయాణంగా పాపిరెడ్డి నగర్ కు విచ్చేసిన సందర్భంగా మాదాసు అనంత రాములు దంపతులకు ఆలయ చైర్మన్ గడ్డం రాజేశ్వర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి దొడ్ల రామిరెడ్డి ఇతర నాయకులతో కలిసి ఆ పుణ్యదంపతులను ఘన స్వాగతం పలుకుతూ శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా చిట్టిరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఇలాంటి యాత్రలు మరెన్నో చేసుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం అని అన్నారు.అలాగే ఆలయ సేవ చేసుకుంటూ ఆయురారోగ్యాలతో వుండాలని వేద పండితులు వేంకటాచార్యులు,గంగాధర్ పంతులు వారిని ఆశీర్వదించారు.కార్యక్రమములో ఏసిరెడ్డి భూపాల్ రెడ్డి,అక్కి రెడ్డి,దశరథ్,తిరుపతి రెడ్డి,శరత్ రెడ్డి,కిరణ్,నరహరి గౌడ్,శ్రీనివాస్ రావు,రవి మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.