

సబ్ టైటిల్: రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
జనం న్యూస్ మే 18 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం శిలాంపల్లి రైతు వేదిక వద్ద శనివారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా రైతు నచ్చిన మెచ్చిన చట్టం భూభారతి రెవెన్యూ చట్టం అని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి కొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు సిలక్చేడ్ మండలాన్ని తీసుకొని 16 రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి పూర్తి చేసినందుకు అధికారులను ప్రశంసించారు చిలిపి చెడు రైతు వేదిక వద్ద భూభారత్ చట్టం సదస్సును నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రెవెన్యూ మినిస్టర్‌గా తాను తమ స్వార్థం కోసం ఈ చట్టాన్ని చేయలేదన్నారు 18 రాష్ట్రాల్లో ఉన్న రెవెన్యూ చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించి అందులో ఉన్న ముఖ్యమైన అంశాలను తీసుకొని వేలాదిమంది అభిప్రాయాలను తీసుకొని మీరు నచ్చిన విధంగా తయారు చేసిన చట్టమే భూభారత్ చట్టం అని తెలియజేశారు ఆనాడు ధరణి చట్టాన్ని తీసుకొచ్చారు కానీ సమస్యలు వస్తే దాన్ని పరిష్కరించే మార్గం చూపలేదన్నారు రైతులు భూ సమస్యలు గుర్తించే ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగిందన్నారు మనిషికి ఆధార్ ఎలా ఉంటుందో అదే విధంగా భూధార్ కూడా ఈ చట్టంలో పెట్టడం జరిగిందన్నారు ఎక్కువగా భూములకు మ్యాప్ లేకపోవడం వల్ల ఈ సమస్యలు తలెత్యాయన్నారు భూభారతి చట్టంలో సర్వే చేసి మ్యాపులు ఇచ్చి పాస్ బుక్ లో అప్లోడ్ చేస్తే శాశ్వతంగా భూ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆ సర్వే నంబర్ కి గాని ఆ ఖాతాకి గాని భవిష్యత్తులో ఎప్పుడు ఇబ్బందులు రావని తెలియజేశారు రాబోయే రోజుల్లో రిజిస్ట్రేషన్ టైం లోనే భూములకు సర్వే మ్యాప్ రిజిస్ట్రేషన్ తో పాటు మీ పాస్ బుక్ లో కానీ మీ డాక్యుమెంట్లలో కానీ అప్లోడ్ చేసే కార్యక్రమాన్ని ఈ చట్టంలో ప్రవేశ పెట్టామని తెలిపారు భూభారతి చట్టంలో రైతులకు డాక్యుమెంట్ సాఫ్ట్ కాపీ తో పాటు అందించి జమాబంధీ కార్యక్రమాన్ని కచ్చితంగా ఏర్పాటు చేస్తామన్నారు మండలంలో ఉన్న 16 రెవెన్యూ గ్రామాల్లో 1500దరఖాస్తులు వచ్చాయని తెలిపారు వాటిని పరిష్కరించే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ప్రతి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్లను ప్రతి ఒక్కరికి లబ్ధిదారులకు అందేలా చూస్తామని మాది రైతు ప్రభుత్వం అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ సుహాసిని రెడ్డి మెదక్ ఆర్డిఓ రమాదేవి నరసాపూర్ ఆర్డీవో మైపాల్ రెడ్డి తూప్రాన్ ఆర్డీవో జయచంద్ర రెడ్డి నర్సాపూర్ తాసిల్దార్ శ్రీనివాస్ ఆంజనేయులు సహదేవ్ శ్రీహరి సునీల్ సింగ్ తాజా ఎమ్మెల్సీ గోదావరి అంజిరెడ్డి ఎంపీ రెవెన్యూ శాఖకు సంబంధించిన అధికారులు పోలీస్ సిబ్బంది తదితరులు రఘునందన్ రావు స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కలెక్టర్ రాహుల్ రాజ్ రైతులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు