

రేపు రాష్ట్ర స్థాయి మహిళా కబడ్డీ పోటీలు
20న జబర్దస్త్ బృందంతో మెగా మ్యూజికల్ నైట్
జనం న్యూస్,మే18,
అచ్యుతాపురం:మండలం లోగల దుప్పితూరు గ్రామంలో వెలసియున్న శ్రీశ్రీశ్రీ చిట్టి పైడితల్లమ్మ అమ్మవారి పండుగను ఘనంగా నిర్వహించడానికి జోరుగా ఏర్పాట్లు సాగుతున్నాయి.ఈ నెల 20వ తేదీ మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు గ్రామస్థులు,పెద్ద ఎత్తున సన్నద్ధమవుతున్నారు.ఈ పండుగను పురస్కరించుకుని 19 వ తేదీ సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 20 వ తేదీ మంగళవారం వరకు రాష్ట్ర స్థాయి మహిళా కబడ్డీ పోటీలు అలాగే 20 వ తేదీ మంగళవారం పండుగ రోజు రాత్రి 8గంటలకు జబర్దస్త్ వారిచే భారీ స్థాయిలో మెగా మ్యూజికల్ నైట్ నిర్వహిస్తున్నామని శెట్టి చిరంజీవి తెలిపారు. మంగళవారం ఉదయం ఉదయం నుంచే అమ్మవారికి ధూప, దీప, నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని తెలిపారు. అన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆలయం వద్ద అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు దేశంశేట్టి పైడినాయుడు తెలిపారు.ఈ కార్యక్రమంలో పిఏసిఎస్, మాజీ బ్యాంక్ చైర్మన్ శెట్టి నాగేశ్వరరావు, ప్రగడ ప్రకాష్, ప్రగడ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.