Listen to this article

మాలి మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పెట్కులే….

జనం న్యూస్ 18 మే ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో

సామాజిక ఉద్యమ పితామహుడు మహాత్మ జ్యోతిబాపూలే భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే వారసులైన మాలికుల విద్యార్థిని విద్యార్థులు ఉన్నత చదువులు చదివి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని అఖిల భారతీయ మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పెట్కులే అన్నారు. శని వారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని అఖిల భారతీయ మాలి మహా సంఘం కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఇంటర్, పదవ తరగతి విద్యార్థుల ప్రతిభా పురస్కారం 2025 అవార్డుల ప్రధానోత్సవానికి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ మహిళలు అన్ని రంగంలో రాణించాలంటే చదువు ఒక్కటే ఆయుధమని భావించిన మహాత్మ జ్యోతిబాపూలే తన భార్య సావిత్రిబాయి పూలే చదువు నేర్పించి భారత దేశ తొలి మహిళ ఉపాధ్యాయురాలిగా మహిళా సాధికారిత కోసం సమసమాజ నిర్మాణం కోసం మహాత్మ జ్యోతిరావు పూలే దంపతులు ఎనలేని సేవ చేశారని వారి అడుగుజాడల్లో నడిచి మాలి విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మోటివేషనల్ స్పీకర్గా చంద్రపూర్ కి చెందిన విజయ్ ముసడే టెన్త్ ఇంటర్ తర్వాత విద్యార్థులు ఎలా రాణించవచ్చు వారి భవిష్యత్తును ఎలా నిర్మాణం చేసుకోవాలి అనేటటువంటి అనేక విషయాల పై అవగాహన కల్పించారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కేటార్ల రంగయ్య విద్యారంగంలో ముఖ్యంగా ప్రభుత్వ విద్యాలయాల్లో చదివిన విద్యార్థులు ముందుకు ప్రగతి ఎలా సాధించగలుగుతారు. తన అనుభవాలను వివరించి చెప్పారు. కళాశాల అధ్యాపకులు ఈ . రాజ్ కుమార్, మోహర్లే తుకారం, స్వప్న మేడంలు విద్యార్థులకు మంచి మార్గదర్శనం చేశారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండి చదువు పై శ్రద్ధ వహించి అమ్మానాన్నలు కన్నా వారి ఆశల కోసం పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ మాలి మహా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నారాయణ గురునూలే, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శంకర్ నాగోషే, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు మేంగాజి గుర్నులే, యువజన విభాగం అధ్యక్షులు మొహర్ల శ్రీకాంత్, సావర్ ఖేడ మాజీ సర్పంచ్ తులసిరామ్ కావుడే, ప్రధాన కార్యదర్శి సోమేశ్వర్ షిండే, ఆసిఫాబాద్ మండల అధ్యక్షులు అదే బాపూరావు, బెండరీ కృష్ణ ,షిండే సుధాకర్ పటేల సంఘం అధ్యక్షులు షిండే నారాయణ నాగోసే శివరం తదితరులు పాల్గొన్నారు.