

జనం న్యూస్ మే 18 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ)
పాక్ ఉగ్రశిబిరాలపై భారత చర్యలకు ప్రపంచమంతా మద్దతు
ప్రధాని మోడీ నాయకత్వంలో ఆపరేషన్ సింధూర్ భారత సైనిక శక్తి, ఆయుధ సామర్థ్యం ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన ఘన విజయం : పాకిస్తాన్ మద్దతుతో పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందని, ముమ్మిడివరం మున్సిపల్ కార్యాలయం నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు జాతీయ జెండాలతో ర్యాలీ జరిగినది. ర్యాలీలో టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలతోపాటు పెద్ద సంఖ్యలో యువత, ప్రజలు దేశభక్తితో జాతీయ జెండాలు పట్టుకుని పాల్గొన్నార పహల్గాం ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రధాని మోడీ సారథ్యంలోని భారత ప్రభుత్వం పూర్తి భరోసా కల్పించిందని అన్నారు.. భారత ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఉగ్రవాదానికి గట్టి బుద్ధి చెప్పటంతో పాటు ప్రపంచం మన దేశ ధైర్యాన్ని చూసిందన్నారు. భారతదేశం ఐదవ ఆర్థిక శక్తిగా ఎదగడం జీర్ణించుకోలేని కొన్ని దేశాలు అసూయతో కుట్రలు చేస్తున్నాయని, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా సమర్ధవంతంగా తిప్పికొడతామని త్వరలోనే మూడవ ఆర్థిక శక్తిగా భారత నిలవడం ఖాయం అన్నారు. ఈ తిరంగా యాత్రలో , బిజెపి జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ , ముమ్మిడివరం నియోజకవర్గం కన్వీనర్ గొల కోటి వెంకటరెడ్డి కోనే రామమూర్తి బసవ శ్రీహరి సకిరెడ్డి శ్రీనివాస్ తెలుగుదేశం నాయకులు తాడి నరసింహమూర్తి గొల కోటి దొరబాబు గాలి దేవర గంగాధర్ జనసేన నాయకులు శివాజీ గోలకోటి సాయిబాబు పలువురు టిడిపి, బిజెపి, జనసేన నాయకులు, కార్యకర్తలు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, పెద్ద సంఖ్యలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
