

జనం న్యూస్ జనవరి 21 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి పార్టీలో కష్టపడ్డ ప్రతి ఒక్కరికి సముచిత స్థానం దక్కుతుంది- కొప్పిశెట్టికూకట్పల్లి నియోజకవర్గానికి మహిళా బి బ్లాక్ అధ్యక్షురాలిగా నూతనంగా నియమింపబడ్డ మిట్టకోలు సంధ్య ఈరోజు మర్యాదపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ మాజీ ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి దినేష్ కుమార్ ని తన పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ గత కొద్దికాలంగా కాంగ్రెస్ పార్టీలో మహిళల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అత్యంత చురుకుగా , కూకట్పల్లి నియోజకవర్గం లోనే ఎక్కువ సభ్యత్వాలు నమోదు చేసిన సంధ్య గారికి బి బ్లాక్ మహిళా అధ్యక్షురాలి పదవి దక్కడం సంతోషకరమైన విషయం అని, నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం తలపెట్టిన చురుకుగా అందులో పాల్గొనడమే కాక మహిళా కాంగ్రెస్ కోసం తను పడ్డ కష్టానికి తగిన ఫలితం దక్కిందని తెలిపారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలను ఇంకా ఆకర్షితులయ్యే విధంగా కష్టపడాలని, కాంగ్రెస్ పార్టీ అమలు పరుస్తున్న పథకాలను అతి చేరువుగా ప్రజల వద్దకు తీసుకెళ్లాలని సూచిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ నాయకురాలు రేణుక, కల్పన తదితరులు పాల్గొన్నారు.