Listen to this article

జనం న్యూస్ జనవరి 21 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి శ్రీ శారద ఎడ్యుకేషనల్ సొసైటీ వాళ్ళు బిర్లా ప్లానిటోరియంలో నిర్వహించిన సౌత్ ఇండియన్ ఉమెన్ ఇన్స్పిరేషనల్ అవార్డ్స్ 2025 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మరియు అవని స్వచ్ఛంద సంస్థకు గాను అవార్డును స్వీకరించిన అవని స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు శిరీష సత్తూర్.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇష్టంతో చేసే ప్రతి పని కష్టం అనిపించదు, మనతో పాటు మన చుట్టూ ఉన్న నలుగురు కూడా సంతోషంగా ఉండాలి, చదువుకోవాలి, ఎంతో ఎత్తుకు ఎదగాలి అని ఎల్లప్పుడూ కోరుకునే మనస్తత్వం నాది.. అందుకోసం అవని స్వచ్చంద సంస్థని స్థాపించి అనుక్షణం సేవలు అందిస్తూ ముందుకు వెళ్తున్నానని, ఈ ప్రయాణంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా బలంగా నిలబడే శక్తిని నాకు ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు