

శ్రీ చాముండేశ్వరి సేవా సమితి శాత మండల్ ఆధ్వర్యంలో శ్రీ చాముండేశ్వరి దేవి 42వ వార్షికోత్సవం సందర్భంగా బాలాజీ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచితంగా వైద్య శిబిరము జనం న్యూస్ జనవరి 21 మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చిట్కుల్ శివారులో మంజీరా నది ప్రక్కన వెలసిన ఆలయం శ్రీ చాముండేశ్వరి మాత ఆలయం ఈ ఆలయం 42వ వార్షికోత్సవం పూర్తిచేసుకుని ఘనంగా పూజలు నిర్వహించారు సోమవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా ఉదయము 10:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు జపములు పారాయణములు మరియు మధ్యాహ్నము మూడు గంటల నుండి రాత్రి 8 గంటల వరకు మహా చండి హవనము మహా పూజ మహా నివేదన హారతి తీర్థ ప్రసాద వినియోగము మంగళవారము ఉదయము 10:00 నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జపములు మరియు ఉదయం 10 గంటలకు ఉత్తర ద్వారా గోపుర కలశ ప్రతిష్ట జరుపబడినది మధ్యాహ్నము మూడు గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మహా చండి హవనము మహా పూజ మహా నివేదన పూర్ణాహుతి హారతి తీర్థప్రసాద వినియోగ కార్యక్రమం జరిపించినారు ఉత్తర ద్వారా గోపుర కలశ ప్రతిష్ట అంగరంగ వైభవంగా నిర్వహించారు మరియు అమ్మవారి మహా చండీ హ వనము ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పెద్ద ఎత్తున పురోహితులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మరియు శ్రీ చాముండేశ్వరి 42వ వార్షికోత్సవం సందర్భంగా బాలాజీ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ వైద్య శిబిరంలో పలు రకాలకు చెందినటువంటి రోగులకు వైద్యం నిర్వహించి టాబ్లెట్లు మరియు కంటికి అద్దాలు ఇచ్చారు వైద్య శిబిరం పొద్దున నుండి సాయంత్రం వరకు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు వివిధ రకాల రోగులకు మందులు పంపిణీ చేశారు మరియు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మరియు అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు