

జనం న్యూస్ మే 21(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-సబ్జెక్టు-మునగాల మండల పరిధిలోని తాడువాయి సొసైటీ అవకతవకలపై ఈనెల 21 నుంచి 23 తేదీ వరకు సొసైటీ పరిధిలోని రైతులకు విచారణ నిర్వహిస్తున్నట్లు అసిస్టెంట్ రిజిస్టర్ తాడువాయి సొసైటీ విచారణ అధికారి ఇందిరా తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాడ్వాయి సహకార సంఘంలో గతంలో రుణాలు పొంది తిరిగి చెల్లించిన రైతులు జమకాని రైతులు ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే రసీదుల ఆధారంగా వారి యొక్క అభ్యంతరాలు తెలపాలని అన్నారు. ఈనెల 21 న విజయరాఘవపురం, నరసింహులగూడెం, కలకోవ 22 న తాడ్వాయి, వెంకటరాంపురం, మాధవరం జగన్నాధపురం 23 న నేలమర్రి, రేపాల ఆ గ్రామాల రైతులు విచారణ లో హాజరు కావాలన్నారు. మూడు రోజులపాటు సొసైటీ పరిధిలోని అన్ని గ్రామాల రైతులు హాజరై అభ్యంతరాల తో పాటు రైతులు వారి పూర్తి సమాచారం అందించాలని తెలిపారు.