Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 20 రిపోర్టర్ సలికినీడి నాగరాజు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశముల మేరకు జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ పల్నాడు జిల్లా వారి సహకారం తో స్థానిక CAMP స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 20 వ తారీకు సాయంత్రం 5 గంటలకు చిలకలూరిపేట లోని కళామందిర్ సెంటర్ నందు కళాజాతర బృందాలతో వీధినాటకముల ద్వారా HIV AIDS పై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ వీధి నాటకములు ద్వారా HIV/ AIDS వ్యాధి ఎలా వస్తుంది, ఎలా వ్యాపించదు, HIV/AIDS రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, HIV/AIDS వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చిన్న చూపు లేకుండా ఎలాగా సమాజంలో కలిసి జీవించాలి, HIV/AIDS -క్షయ వ్యాధి సంబంధం గురించి, సుఖవ్యాధులు మరియు చికిత్స గురించి, కండోమ్ యొక్క ఉపయోగం గురించి, HIV/AIDS ఆక్ట్ 2017 గురించి ప్రజలలో అవగాహనా కల్పించారు.CHC సెంటర్ LT వంశీ CAMP స్వచ్చంద సేవా సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ కొండా పవన్ కళ్యాణ్ మరియు ANM ఊహ MEA V. శివ CAMP ఆఫీస్ స్టాఫ్ పాల్గొన్నారు.