Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 21 రిపోర్టర్ సలికినీడి నాగరాజు ఆప్త మిత్రులు సాదినేని చౌదరయ్య ఈరోజు వారి సతీమణి తులసమ్మ 8వ వర్ధంతి సందర్భంగా వారి కుమార్తె విద్యా మిత్ర మండలి సభ్యురాలు పంగులూరు ధనలక్ష్మి (W/o సుబ్బారావు ) తల్లి వర్ధంతి సందర్భంగా ఈరోజు బాపూజీ వృద్ధాశ్రమం నందు మహా అన్నదాన కార్యక్రమం మరియు అక్కడ ఉన్న వృద్ధులందరికీ హాట్ బాక్స్ లు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పంగులూరు ధనలక్ష్మి విద్యా మిత్ర మండలి అధ్యక్షురాలు శ్రీమతి మర్రి లలిత మరియు సభ్యులకి బాపూజీ వృద్ధాశ్రమం అధ్యక్ష కార్యదర్శులు ఆరాధ్యుల రామకృష్ణ మురికిపూడి ప్రసాద్ మరియు వృద్ధులు తమ ధన్యవాదాలు తెలియజేశారు