Listen to this article

జనం న్యూస్ జనవరి 22 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ మునగాల మండల పరిధిలోని జగన్నాధపురం ప్రాథమికోన్నత పాఠశాలలో మంగళవారం మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రార్థన సమయానికి హాజరై విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థులోని తెలుగు, ఇంగ్లీష్, గణితములో విద్యా ప్రమాణాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సతీష్ కుమార్, ఉపాధ్యాయులు భరత్ బాబు, లక్ష్మీ పాల్గొన్నారు.