Listen to this article

పంచముఖ హనుమాన్ 18 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించిన రాందాస్ నాయక్.

జనం న్యూస్, 22మే జూలూరుపాడు:

మండల పరిధిలోని పాపకొల్లు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా లింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో హనుమాన్ జయంతి సందర్భంగా వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ శ్రీ పంచముఖ హనుమాన్ 18 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. ముందుగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామ పెద్దలు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి అనంతరం శ్రీ ఉమా లింగేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ ప్రజలందరికీ హనుమాన్ జయంతి పండుగ శుభాకాంక్షలు తెలియ చేశారు ప్రజలు అందరూ ఆంజనేయస్వామి కరుణా కటాక్షాలు అందరి పైన ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. పార్టీలకతీతంగా గ్రామస్తులందరూ కలిసికట్టుగాబి గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఆ దేవుని కృపా కటాక్షాల వల్ల నన్ను ఎమ్మెల్యేగా చేసిన, ప్రజలందరికీ రుణపడి ఉంటానని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు లేళ్ల వెంకటరెడ్డి, జూలూరుపాడు మండల అధ్యక్షుడు మంగీలాల్ నాయక్, మాజీ ఎంపిటిసి మధు,కాంగ్రెస్ నాయకులు రోకటి సురేష్, రామిశెట్టి రాంబాబు, డాక్టర్ చారి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.