

నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు..
జనం న్యూస్ 24 మే 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్)
ఎల్కతుర్తి మండలం సర్కిల్ సెంటర్ వద్ద టి పీసీసీ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ నాయకులు ఘనంగా జరుపుకున్నారు.సర్కిల్ సెంటర్ వద్ద కేక్ కట్ చేసి,అనంతరం ఎల్కతుర్తి బస్టాండ్ లో ప్రయాణికులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి, మాజీ మండల అధ్యక్షులు సుకినే సంతాజి, సింగిల్ విండో మాజీ చైర్మన్ గోలి రాజేశ్వరరావు, సింగిల్ విండో డైరెక్టర్ ముప్పు మహేందర్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు అంబాల శ్రీకాంత్( బక్కి) బొల్లె పోగు డాక్టర్ రమేష్ బాబు, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి శనిగరం వెంకటేష్, యూత్ కాంగ్రెస్ సిద్దిపేట జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి మండ సుమన్ గౌడ్, మాజీ యూత్ మండల అధ్యక్షులు అంబాల స్వామి, బచ్చు బాపురావు, బావుపేట, వల్బాపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు బత్తిని రవీందర్, కట్కూరి గౌతమ్, తంగేళ్లపల్లి కొమురయ్య, పున్నం చందర్, సీతార హోటల్ రమేష్, తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
