

జనం న్యూస్ జనవరి 21 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జనవరి నెల 20 వ తేదీ నుండి 31 వ తేదీ వరకు అనకాపల్లి మండలంలో పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం పిసినికాడ గ్రామం లో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది,మొత్తం 65పశువులకు , దూడ పెయ్యలకు నట్టల నివారణ మందులు ఇవ్వడం జరిగింది, 15 పశువులకు గర్భకోశ వ్యాధుల కు ఉచితంగా చికిత్సలు నిర్వహించి, CADDL వారు అన్ని పశువులకి వ్యాధి నిర్ధరణ పరీక్షలు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో అనకాపల్లి అసిటెంట్ డైరెక్టర్ డా సౌజన్య, డా అనిల్ కుమార్ సిబ్బంది కుమారీ,కిరణ్, సంతోష్, కావ్య, రాము పాల్గొన్నారు./