Listen to this article

రాష్ట్ర హోంశాఖామాత్యులు శ్రీమతి వంగలపూడి అనిత
జనం న్యూస్ 22 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్… రాష్ట్ర హెూం శాఖామాత్యుల శ్రీమతి వంగలపూడి అనిత గారు జిల్లా పోలీసు కార్యాలయాన్ని జనవరి 21న  సందర్శించి, పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ రాష్ట్ర హెూం శాఖామాత్యులు వంగలపూడి అనితకు పుష్ప గుచ్చంను అందించి, స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర హెూంశాఖామాత్యులు శ్రీమతి వంగలపూడి అనిత మాట్లాడుతూ – జిల్లా పోలీసు మరియు ఆర్మ్డ్ రిజర్వు కార్యాలయాల అభివృద్ధి మరియు ఆధునీకరణకు అవసరమైన నిధులను మంజూరు చేస్తామని, అందుకు సంబంధించిన ప్రతిపాదనలను పంపాలని జిల్లా ఎస్పీని కోరారు. పోలీసు కార్యాలయంలోని ప్రతీ సీటును సందర్శించి, మినిస్టీరియల్ సిబ్బంది నిర్వర్తించే విధులు, వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పోలీసు నియామక ప్రక్రియలో భాగంగా ప్రతీ రోజూ ఉదయం 4గంటలకే విధులకు హాజరవుతున్నారని, కష్టపడుతున్నారని, రేపటితో నియామక ప్రక్రియ ముగుస్తున్నట్లుగా రాష్ట్ర హెూంమంత్రికి జిల్లా ఎస్పీ తెలిపారు. అనంతరం, రాష్ట్ర హెూంశాఖామాత్యులు జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంను, ఆర్మ్ డ్ రిజర్వు కార్యాలయాన్ని సందర్శించారు. పోలీసు నియామక ప్రక్రియ ఏవిధంగా జరుగుతున్నది జిల్లా ఎస్పీని అడిగి తెలుసుకున్నారు. నియామక ప్రక్రియ పూర్తయితే రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుశాఖ బలోపేతం అవుతుందన్నారు. ఇటీవల రామభద్రపురం పోలీసు స్టేషనులో ఆరు మాసాల పసికందుపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడికి కేసు నమోదైన ఐదు మాసాల వ్యవధిలోనే 25 సం.లు జైలుశిక్ష విధించే విధంగా ప్రాసిక్యూషను పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టినందుకుగాను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ను రాష్ట్ర మంత్రివర్యులు వంగలపూడి అనిత ప్రత్యేకంగా అభినందించారు. జిల్లాలో గంజాయి నియంత్రణకు చర్యలు చేపట్టాలన్నారు. ఛార్జ్ షీట్స్ ను నిర్ధిష్ట సమయంలోగా న్యాయ స్థానాల్లో దాఖలు చేయాలని, కేసుల వివరాలు, దర్యాప్తు అంశాలను ఎప్పటికప్పుడు CCTNS లో సకాలంలో నేర నియంత్రణలో సాంకేతికతను, సిసి కెమెరాలను, డ్రోన్స్ వినియోగించాలన్నారు. నేర నియంత్రణలో సిసి కెమెరాలు, డ్రోన్స్ ఎంతగానో ఉపయోగపడుతున్నాయని, సిసి కెమెరాల ఏర్పాటుకు ఎక్కువ ప్రాధాన్యత కల్పించాలని, ముఖ్య కూడళ్ళు, ప్రాంతాలు, రద్దీ ప్రదేశాల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు. ఒక డ్రోన్ 20మంది
పోలీసులు చేసే పని చేసే అవకాశం ఉందని, ప్రతీ పోలీసు డ్రోన్ ఆపరేట్ చేసే విధంగా శిక్షణ పొందాలన్నారు. జిల్లాలో ప్రతీ పోలీసు స్టేషనుకు డ్రోన్ ఆవస్యకత ఉందని, త్వరలో 30 డ్రోన్స్ ను అందించేందుకు కృషి చేస్తానని జిల్లా ఎస్పీకి రాష్ట్ర మంత్రివర్యులు స్పష్టమైన హామీ నిచ్చారు. డ్రోన్స్ ను వినియోగించేందుకు అవసరమైన శిక్షణను త్వరితగతిన పూర్తి చేయాలని, డ్రోన్ శిక్షణలో మహిళా పోలీసు కానిస్టేబుళ్ళకు ఎక్కువగా ప్రాధాన్యత కల్పించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ను రాష్ట్ర హెూంశాఖామాత్యులు అనిత ఆదేశించారు.
రాష్ట్ర హెూం శాఖామాత్యుల వెంట రాష్ట్ర మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్, పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పల నాయుడు, విజయనగరం ఎమ్మేల్యే పూసపాటి అతిథి గజపతిరాజు, జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఒఎస్టీ అనిల్ పులిపాటి, ఎఆర్ అదనపు ఎస్పీ జి.నాగేశ్వరరావు, ఇతర ప్రజా ప్రతినిధులు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.