Listen to this article

జనం న్యూస్ జనవరి 22 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- అభినందించి అండగా ఉంటానని హామీ ఇచ్చిన శేరిలింగంపల్లి కాంగ్రేస్ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్, పట్వారి  శేరిలింగంపల్లి నియోజకవర్గ ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ గణేష్ నగర్ నివాసి చింత ప్రవీణ్ ఎంపికయ్యారు.ఢిల్లీ లో జరగబోయే కిక్ బాక్సింగ్ 57కిలోల విభాగంలో అంతర్జాతీయ పోటీలకి ఎంపిక ఐన విషయం తెలుసుకున్న ఆల్విన్ కాలనీ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పట్వారి శశిధర్ ప్రవీణ్ తో కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ మర్యధపుర్వకంగ కలిసారు.జగదీశ్వర్ గౌడ్ ప్రవీణ్ కి శాలువతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ ప్రవీణ్ కి ఈ టోర్నమెంట్లో కావాల్సిని ఏ సహాయం ఐనా సరే తాను చేస్తాను అని హామీ ఇచ్చారు,ప్రభుత్వం ద్వారా కూడా తనకు కావాల్సిన సహాయం కూడా చేస్తాం అని హామీ ఇచ్చారు, అధే విధంగా పట్వారి శశిధర్ కూడ తనకు అండగా సహాయంగా ఉంటాను అని తెలియజేశారు.కార్యక్రమంలో జి.రవి,బొర్ర నాగేశ్వర్ రావు,మజర్,నాగన్న,మల్లయ్య,ప్రవీణ్,శివ చారి, టీం పట్వారి తదితరులు పాల్గొన్నారు…