Listen to this article

జనం న్యూస్ జనవరి 22 ( బీబీపేట మండలం కామారెడ్డి జిల్లా ):-  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి, విద్యుత్తు ఆర్టిజన్స్ రిలే నిరాహార దీక్షలు మూడవ రోజుకు చేరిన ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోవడం విచారకరమని, కామారెడ్డి జిల్లా సీనియర్ ఆర్టిజన్స్ అడ్వైజర్ నాంపల్లి, తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ విద్యుత్తు ఆర్టిజన్లను కాంగ్రెస్ ప్రభుత్వం (కన్వర్షన్) పర్మినెంట్ చేస్తానని ఎన్నికల ముందు, హామీ ఇచ్చిందని కానీ, ఇప్పుడు విద్యుత్ ఆర్టిజన్లను పట్టించుకోవడంలేదని తీవ్ర మనోవేదనకు గురయ్యారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం పర్మినెంట్ చేస్తానని మోసం చేసిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే విద్యుత్ ఆర్టిజన్లను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారని, ఆ యొక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి చర్చల ద్వారా ఆర్టిజన్ల యొక్క సమస్యలను పరిష్కరించి, 20వేల ఆర్టిజన్ కుటుంబాల జీవితాలలో వెలుగును నింపాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ఆర్టిజన్ కార్మికులు రాజ్యాంగపరమైన హక్కులను వారి యొక్క ఫలాలను అందించాలని కోరారు. ఇట్టి విలేకరుల సమావేశంలో ఆర్టిజన్స్ బాలేశం, రామ్ చంద్రం, వెంకటేష్,రాజిరెడ్డి, సునీల్ కుమార్, కుమారస్వామి, స్వామి, అనేకమంది కార్మికులు పాల్గొన్నారు.