

జనం న్యూస్ మే 30(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)
మరి కొన్ని రోజుల్లో సీజన్ ప్రారంభమవుతున్నందున ముందస్తు ఏర్పాట్లు చేయాలని మునగాల మండల వ్యవసాయ అధికారి రాజు అన్నారు. గురువారం మునగాల మండలం లోని అన్ని సహకార సంఘాల సిఈఓ లు,సిబ్బంది తో మునగాల మండల కేంద్రంలోని రైతు వేదిక లో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఈ సీజన్ కి యూరియా తో పాటు ఇతర ఎరువుల కొరత రాకుండా ముందస్తుగా మార్కఫెడ్ కి నగదు జమచేసి ఎరువులు తెప్పించాలన్నారు. స్టాక్ రిజిస్టర్ లు, బిల్ బుక్ లు, ఈ-పోస్ మెషిన్ ల ద్వారా యూరియా అమ్మాలని చెప్పారు.రైతులకు సరిపడు యూరియా ముందుగానే తెప్పించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైతే ఇంకా కొన్ని గోడౌన్ లు ఏర్పాటు చేసుకొని, ఎక్కడి రైతులకు అక్కడే పంపిణీ చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమం లో సహకార సంఘాల సిఈఓ లు బసవయ్య, శ్రీనివాసరావ్, ప్రవీణ్, సుధాకర్ లు సిబ్బంది గణేష్, గోపి, ఎల్లయ్య పాల్గొన్నారు.