

అందజేసిన సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు
భద్రాచల కల్యానానికి గోటి తలంబ్రాలు అందించిన ఘనత
జనం న్యూస్, మే 30 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)
భద్రాచల రామయ్య కళ్యాన ముత్యాల తలంబ్రాలు, కళ్యాన శేషవస్త్రాలను గురువారం ప్రముఖ వ్యాపారవేత్త ఇల్లేందుల శ్రీనివాస్,రజని, దంపతులకు తలంబ్రాలు పవిత్రత తెలియజేసి అందజేసి ఆశీర్వాచనాలు అందించారు.శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవాసంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు. భద్రాచలం వెళ్లలేకపోయినా కూడా మా చేతులతో ఓలిచిన గోటి తలంబ్రాలు రామకోటి రామరాజు, భద్రాచల కళ్యాణంలో అందజేసి తిరిగి భద్రాచల కళ్యాన అనంతరం రామయ్య తలంబ్రాలు మా ఇంటికి తీసుకు రావడం సంతోషంగా ఉందని భక్తులు తమ ఆనందాన్ని తెలిపారు. భద్రాచల తలంబ్రాలు కొన్నైనా మన ఇంటిలో ఉంటే శ్రీరామరక్ష అన్నారు.