

▪ జమ్మికుంట మునిసిపల్ వైస్ చైర్మన్ దేశిని కోటి స్వప్న
జనం న్యూస్ //జనవరి 22//జమ్మికుంట //కుమార్ యాదవ్:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలనలో భాగంగా మున్సిపల్ పరిధిలోని 19వ వార్డులో ఏర్పాటు చేసిన సభలో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి,ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇండ్లు మరియు కొత్త రేషన్ కార్డు గత ప్రభుత్వ హయాంలో ఇవ్వనటువంటి ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు మరియు గత ప్రభుత్వ హయాంలో మీ సేవ కేంద్రాలలో పెట్టుకున్నటువంటి రేషన్ కార్డులో పేర్ల తొలగింపు మరియు పేర్ల జమచేయుట వంటి దరఖాస్తులు స్వీకరించడం జరిగింది, ఇట్టి కార్యక్రమంలో జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని కోటి స్వప్న మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి, చేపట్టినటువంటి ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ ఇండ్లు మరియు కొత్త రేషన్ కార్డులు పేర్ల మార్పు చేర్పులు ఈ ప్రక్రియ నిరంతరం జరుగుతుంది సోషల్ మీడియాలో, ప్రభుత్వం మీద బురదజల్లే విధంగా వస్తున్నటువంటి వార్తలు ఎవరు పట్టించుకోవద్దు అన్నారు.అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు మరియు రేషన్ కార్డులు తప్పకుండా ఈ ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు.అర్హులందరికీ అన్ని పథకాలు అందేలా చూస్తామని దేషిని స్వప్న కొటి, పేర్కొన్నారు .కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్ శేఖర్ & శ్రీకాంత్ ఆర్పీ జేరిపోతుల సృజన,సిబ్బంది ఉద్యోగులు కోడెం రాజు, దూడపాక స్వామి,అంగన్వాడి టీచర్ స్వప్న ,కాంగ్రెస్ నాయకులు దేశిని శ్రీనివాస్,ఎండి సజ్జు, ఉడత వెంకటేష్, ఆడెపు దేవరాజ్, ఎండి ఖలీల్, మంద సునీల్ తదితరులు పాల్గొన్నారు