Listen to this article

ఘనంగా నిర్వహించిన సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు

శ్రీరామ అంటే సమస్త శుభాలు కలుగుతాయి

జనం న్యూస్, మే 31 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)

సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో శ్రీరాముడు జన్మించిన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని శుక్రవారం నాడు శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో అద్దాల మందిరంలో కొలువైన సీతారాములకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు ఈ సందర్బంగా మాట్లాడుతూ శ్రీరామ అంటే సంస్థ శుభాలు కలుగుతాయన్నారు. అన్ని సంపదలు హరించుకునిపోయేవే ఒక ఆధ్యాత్మిక సంపద తప్ప. శాశ్వాతమైనది, జ్ఞానప్రపంచాన్ని అవిష్కరింప జేసేది ఒక ఆధ్యాత్మిక సంపద మాత్రమే అన్నారు. ప్రతి రోజు రామనామాన్ని లక్షల మంది భక్తులు రామకోటి సంస్థ ద్వారా లోక కళ్యాణర్థం రామనామాన్ని లిఖించి తరిస్తున్నారన్నారు.