Listen to this article

జనంన్యూస్. 31. నిజామాబాదు. ప్రతినిధి.

నిజామాబాద్ పోలీస్ శాఖలో మే 31న “పదవి విరమణ నేపద్యంలోని వారి వివరాలు

మే నెలలో వదవి విరమణ చేసిన సిబ్బంది.

  1. జి. చాందయ్య, ఎస్.ఐ, సి.సి.ఆర్.బి, నిజామాబాద్ గారు పోలీస్ శాఖలో (42) సం॥ల సర్వీసు పూర్తి చేసి ” పదవి విరమణ ” పొందినారు. ఎమ్. సత్యం, ఎస్.ఐ, డిచ్పల్లి పోలీస్ స్టేషన్ గారు పోలీస్ శాఖలో (41) సం॥ల సర్వీసు పూర్తి చేసి ” పదవి విరమణ ” పొందినారు. సాబేర్ హుస్సేన్, పి.సి 612, మెండోరా పోలీస్ స్టేషన్ పోలీస్ శాఖలో (43) సం|| ల సర్వీసు పూర్తి చేసి ” పదవి విరమణ ” పొందినారు 4. పి. శ్రీనివాసులు, ఎ.ఎస్.ఐ, మెర్తాడ్ పోలీస్ స్టేషన్ గారు పోలీస్ శాఖలో (35) సం॥ ల సర్వీసు పూర్తి చేసి ” పదవి విరమణ” పొందినారు. పదవి విరమణ వీడ్కోలు కార్యాక్రమం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. వీరికి శాలువలతో సత్కరించి” పదవి విరమణ శుభాకాంక్షలు సర్టిఫికేటు(జ్ఞాపికలతో) ఘనంగా సత్కరించడం జరిగినది. ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐ.పి.యస్ మాట్లాడుతూ పోలీస్ శాఖలో ఎంతో పని వత్తిడితో విధులు నిర్వహించి ఎలాంటి రిమార్కు లేకుండా పదవి విరమణ చేయడం ఎంతో గోప్ప విషయమని ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పక ఉంటుందని, మీరు డిపార్టుమెంటు కు చేసిన సేవలు ఎంతో ఘననీయమని పదవి విరమణ అనంతరము మీకు ఎలాంటి అవసరం వచ్చిన మీకు ఎల్లవేళల సహయపడుతామని, మీరు మరియు మీ కుటుంబ సభ్యులు అయురారోగ్యాలతో ఉండాలని, మీ పిల్లల భవిష్యత్తుభాగుండాలని ఆకాంక్షించారు.
    ఈ వీడ్కోళ్ల సందర్భంగా అదనపు పోలీస్ కమిషనర్ ( అడ్మిన్ ) బస్వారెడ్డి , ఏవో ఆసియా బేగం, సి.సి.ఆర్.బి, సి.ఐ సతీష్ కుమార్ , డిచ్పల్లి సి.ఐ మల్లేష్ , రిజర్వ్ ఇన్స్పెక్టర్స్ శ్రీ తిరుపతి (వెల్ఫేర్) శ్రీ.శ్రీనివాస్ (అడ్మిన్) సతీష్ (హోంగార్డ్స్) , పోలీస్ కార్యాలయం ఆఫీస్ సూపరింటెండెంటు బషీర్ , శ్రీమతి వనజా రాణి , అసోసియేషన్ అధ్యక్షులు షకీల్ పాషా మరియు వారి కుటుంబ సభ్యులు హజరు కావడం జరిగింది.