Listen to this article

జనం న్యూస్ జనవరి 22 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఆన్ లైన్, ఆఫ్ లైన్ మట్కా ఆడుతున్న ఓ యువకున్ని కాగజ్‌నగర్‌ టౌన్ సీఐ పీ.రాజేంద్రప్రసాద్ మంగళవారం పట్టుకోవడం జరిగింది. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం తమకు అందిన పక్కా సమాచారం మేరకు కాగజ్‌నగర్‌ పట్టణంలోని బాలాజీనగర్లో ఆకస్మిక తణిఖీలు చేపట్టగా.. పోతుల సాయికిరణ్ (తండ్రి; వేంకటేశ్) అనే యువకుడు తన ఇంటి వద్ద ఆఫ్ లైన్, ఆన్ లైన్ మట్కా ఆడుతూ పట్టుబడ్డాడు. అతని వద్ద ఉన్న మట్కా చిట్టీలు, మొబైల్ ఫోన్, కెమెరా స్టాండ్, ఒక ప్రింటర్, రూ. 5 వేల నగదును స్వాధీనపరచుకుని టౌన్ పోలీస్ స్టేషను లో కేసు నమోదు చేసినట్లు మరియు అతని ఈరోజు ఎమ్మార్వో గారి ముందు ప్రవేశపెట్టి బైండ్ ఓవర్ కూడా చేయడమైనది అని సీఐ వెల్లడించారు. కాగజ్‌నగర్‌ లో ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ మట్కా, జూదం, ఆడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ రాజేంద్రప్రసాద్ హెచ్చరించారు.