Listen to this article

(జనం న్యూస్ జూన్ 2 భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి )

భీమారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద తెలంగాణ జాతీయ జెండా ను మండల అధ్యక్షులు మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జెండాను ఎగరవేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా చెన్నూరు నియోజకవర్గం ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు కలిసికట్టుగా సుదీర్ఘకాలం కొట్లాడే స్వరాష్ట్రం సాధించుకున్నామని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించి తెలంగాణ రాష్ట్ర కలలను నెరవేర్చిన సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు తెలిపారు. అమరుల ఆశయాల ప్రజలు ఆకాంక్షలతో అనుగుణంగా ప్రజాపాలన కొనసాగిస్తున్నామన్నారు. సుమారు 21 వేల కోట్ల పైగా రుణమాఫీ చేశామని 500 సన్న వడ్లు బోనస్ 60 వేల పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని రాజీవ్ యువ వికాసం స్కీం ద్వారా ఉపాధి కల్పిస్తామని మహిళా సంఘాలకు రుణాలు ఇందిరమ్మ ఇల్లు నిరుపేద కుటుంబాలకు సొంత ఇంటి కల పునాదులు వేశామని అన్నారు. సన్న బియ్యం పంపిణీ 200 యూనిట్లు కరెంట్ ఉచిత గ్యాస్ పేద కుటుంబాలకు ఆర్థికంగా చేయూతను అందిస్తున్నామన్నారు. ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం ఆరోగ్య విద్యా ద్వారా విద్య వైద్యం ఆర్థిక అధిగమిస్తూ అని రంగాలలో ప్రజలు ఆశలు అనుగుణంగా ముందుకు తీసుకెళ్తామని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి జరుపల రాజ్ కుమార్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు చేకుర్తి సత్యనారాయణ రెడ్డి పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది