

మంద పవన్,సీపీఐ జిల్లా కార్యదర్శి,సిద్దిపేట
జనం న్యూస్, జూన్ 3 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)
వందలాది మంది విద్యార్థి అమరవీరుల వీరోచిత పోరాటం వల్ల,అమరుల త్యాగ ఫలితం వల్ల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్దించిందని,అమరుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పని చేయాలని సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్ అన్నారు..సోమవారం రోజున తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎడ్ల గురువారెడ్డి భవన్ వద్ద ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు..
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ….. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1969లో అనేకమంది అమరులయ్యారని,మలిదశ ఉద్యమంలో సుమారు 1200 మంది విద్యార్థులు త్యాగాలు చేశారని, సకలజనులు తెలంగాణ రాష్ట్రం కోసం ఉవ్వెత్తున పోరాటం చేశారని గుర్తు చేశారు.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సీపీఐ పార్టీగా ఒకే విధానంతో ఉండి జాతీయ పార్టీని ఒప్పించి,ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందేనని జాతీయ పార్టీలో తీర్మానం చేసి,నిరసన కార్యక్రమాలు,ఆందోళనలు,పార్టీ ప్రజా సంఘాల ద్వారా పోరాటాలు పెద్ద ఎత్తున చేశామన్నారు.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో సిపిఐ పాత్ర మరువలేనిదన్నారు. అమరవీరుల కుటుంబాలకు ఆదుకోవాలని,అమరుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పాలన ఉండాలని,
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలు కృషి చేయాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని అన్నారు..ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కిష్టపురం లక్ష్మణ్, కనుకుంట్ల శంకర్,పట్టణ కార్యదర్శి గజాభీమకర్ బన్సీలాల్, కర్ణాల చంద్రం,ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జేరిపోతుల జనార్ధన్,ఏఐఎస్ఎఫ్ నాయకులు రామగళ్ల నరేష్,వేల్పుల ప్రసన్న కుమార్,నాయకులు బెక్కంటి సంపత్,కానుగుల రామనకర్,నాగరాజు తదితరులు పాల్గొన్నారు..