

జనం న్యూస్ జనవరి 23 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్… మునగాల మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో బుధవారం ఉదయం మంచు దుప్పటి పరుచుకుంది.తెల్లవారుజాము నుండి ఉదయం 11 గంటలు దాటినా సూర్యుడు కనిపించనంత మంచు కురిసింది.జాతీయ రహదారిపై రాకపోకలు సాగించే వాహనదారులకు ఏమి కనిపించకపోవడంతో లైట్లు వేసుకొని ప్రయాణించవలసి వచ్చింది. పాఠశాలలకు, కళాశాలకు వెళ్లే విద్యార్థులు మంచు కారణంగా చలితో తీవ్ర ఇబ్బందులు పడ్డారు……..