Listen to this article

జనం న్యూస్ జనవరి 22 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు స్వీకరణ అని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించగా ఈ నేపథ్యంలో వివేకానంద నగర్ డివిజన్ కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు వార్డ్ ఆఫీస్ కి వెళ్లి పరిశీలించగా అక్కడ ఏ అధికారి లేకపోవడంతో వారికి ఫోన్ చేసి మాట్లాడగా వారికి దరఖాస్తుల స్వీకరణకు ఎటువంటి సూచనలు ఇవ్వలేరని చెప్పారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మాట్లాడుతూ ఈరోజు పిఎసి చైర్మన్,శేర్లింగంపల్లి నియోజక వర్గం శాసనసభ్యులు అరికెపూడి గాంధీ గారు వాణిజ్య మాధ్యమాల్లో కొత్త రేషన్ కార్డు దరఖాస్తులు ఈనెల ఇరవై ఒకటో తేదీ నుండి ఇరవై నాలుగవ తేదీ శుక్రవారం వరకు వారి వారి డివిజన్లోని వార్డ్ ఆఫీసులలో స్వీకరించబడునని ప్రకటించారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రజలందరూ తమ తమ దరఖాస్తులు ఇవ్వడానికి వార్డ్ ఆఫీస్ కి చేరుకోగా అక్కడ అధికారులు మాత్రం తమకు దరఖాస్తులు స్వీకరించమని ఎలాంటి సూచనలు అందలేదని ప్రజలను తిప్పి పంపిస్తున్నారు. కాంగ్రెస్ పాలకులకు మరియు అధికారులకు సమన్వయ లోపమా లేకపోతే ప్రజలను మభ్యపెట్టడానికి ప్రకటనలు చేస్తున్నారా. పాలకుల ప్రకటనలకు క్షేత్రస్థాయి ఆచరణకు ఎటువంటి సంబంధం లేకుండా ప్రజలను ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న ప్రజా పాలన ఇదేనా.
ఇప్పటికే ప్రజా పాలనలో ఇచ్చిన దరఖాస్తులు కూడా కేవలం నలబై శాతం మాత్రమే ఎంట్రీలు అవడంతో ప్రజలు అధికారుల చుట్టూ తిరుగుతూ అయోమయంలో ఉండగా ఇప్పుడు కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు విషయంలో స్పష్టతలేని ప్రకటనలు చేయడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నారు అని అన్నారు.