


జనం న్యూస్ జనవరి 22 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో:- కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్ లలో నమోదైన 53 కేసుల్లో నిందితుల నుండి సీజ్ చేసిన ప్రభుత్వ నిషేధిత గంజాయి 117.8 -కిలోలను, ఎన్ డి పి ఎస్ చట్ట ప్రకారం జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో ఇన్సినిరేషన్ ప్రక్రియ ద్వారా పర్యావరణ కాలుష్య నియంత్రణ నిబంధనలను పాటిస్తూ కరీంనగర్ జిల్లా మానకొండూరు వద్దగల వెంకటరమణ ఇన్సినిరేటర్స్ సెంటర్ వద్ద బుధవారం దహనం చేయడం జరిగిందని, దహనం చేసిన గంజాయి విలువ సుమారు 74 లక్షలు రూపాయలు ఉంటుందని జిల్లా ఎస్పీ ఒక ప్రకటన లో వివరించారు. జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ గా జిల్లా ఎస్పీ శ్రీ డివి శ్రీనివాసరావు ఐపీఎస్ మరియు కమిటీ సభ్యులు గా అదనపు ఎస్పీ ప్రభాకర రావు, కాగజ్ నగర్ డిఎస్పి రామనుజం ఉండడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఎన్ డి పి ఎస్ యాక్ట్ లోని నియమనిబంధనల ప్రకారం జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో నమోదు చేయనడిన 53 కేసులలో నిల్వ ఉన్న గంజాయిని దహనం చేయడం జరిగిందని తెలియజేసారు. కొందరు అక్రమార్జనలో భాగంగా, గంజాయి సాగు, విక్రయిస్తూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని యువతను ప్రలోభాలకు గురి చేస్తూ మత్తులోకి దించుతున్నారన్నారు. అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడే వారిని అరికట్టడం కోసం జిల్లా వ్యాప్తంగా పోలీసుల ద్వారా విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎవరైనా గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలను సాగు చేసిన, రవాణా చేసిన, అమ్మిన, సేవించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కరీంనగర్ లో గంజాయి దహన కార్యక్రమంలో ఆసిఫాబాద్ జిల్లా అదనపు ఎస్పి ప్రభాకర రావు , డిసిఆర్బి ఇన్స్పెక్టర్ శ్రీధర్, ఇతర పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.