Listen to this article

అడ్డుకున్న ఎస్ఎఫ్ఐ నాయకత్వం దాడికి దిగిన యాజమాన్యం


యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డీఈవోకు ఎస్ఎఫ్ఐ నాయకులు వినతి

జనం న్యూస్ 04 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

రాజాం పట్టణంలో ఉన్న అబ్యాస్ ఇంటర్నేషనల్ స్కూల్ నందు విద్యా హక్కు చట్టానికి విరుద్ధంగా పుస్తకాలను అమ్ముతున్నారు. దీనిని అడ్డుకున్న ఎస్ఎఫ్ఐ నాయకత్వం పై పాఠశాల యాజమాన్యం దుర్భాషలు ఆడుతూ దాడికి దిగడాన్నీ ఖండిస్తూ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీఈవో మాణిక్యాల నాయుడు గారికి SFI నాయకులు వినతి పత్రం అందజేశారు . ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు D రాము, Ch వెంకటేశులు మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేసరికి జిల్లా వ్యాప్తంగా పుస్తకాల వ్యాపారం తారాస్థాయికి చేరుకుందని, అధికారులు కనీసం పట్టించుకునే పాపాన పోవడం లేదని విమర్శించారు. ఎస్ఎఫ్ఐ రాజాం మండల కమిటీ ఆధ్వర్యంలో కొన్ని పాఠశాలలను తనిఖీ చేయగా పుస్తకాల అమ్మకాన్ని వారు గుర్తించారని తెలిపారు. పాఠశాల ప్రాంగణంలో పుస్తకాల వ్యాపారం ఆపాలని , విద్యార్థుల నుంచి ఫీజుల దోపిడీ ఆపాలని కోరిన రాజాం మండల నాయకులపై అభ్యాస ఇంటర్నేషనల్ పాఠశాల యాజమాన్యం తీవ్ర దుర్భాషలాడుతూ దాడికి దిగడాన్నీ ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా కమిటీగా ఖండిస్తున్నామని తెలిపారు. జూన్ 12 నుండి పాఠశాల ప్రారంభమవాల్సి ఉన్న అధికారుల అండ ఉందనే నెపంతో ఈ నెల మొదటి నుంచే అభ్యాస్ పాఠశాలలో తరగతులు నిర్వహిస్తున్నారని తెలిపారు. సమాచారం అందుకొని ఎస్ఎఫ్ఐ నాయకులు తరగతులు నిర్వహణను , పుస్తకాల అమ్మకాన్ని అడ్డుకున్నారని తెలిపారు. ఇదే సందర్భంలో పాఠశాల కరస్పాండెంట్ రాజేష్ అక్కడికి వచ్చిన విద్యార్థి నాయకులపై కులం పేరుతో దూషణలకు దిగడం సిగ్గుచేటని విమర్శించారు. దళిత వర్గాలకు చెందిన నాయకులను దూషించిన కరస్పాండెంట్ రాజేష్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ఉపాధ్యక్షులు J రవి కుమార్ పై పాఠశాల యాజమాన్యం భౌతిక దాడి చేయడంతో అతను తీవ్రతకు గురయ్యారని తెలిపారు. తక్షణమే నిబంధనలు తుంగలో తొక్కే ఇటువంటి అభ్యాస్ ఇంటర్నేషనల్ పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యాల నాయుడు గారిని కోరారు. జిల్లా వ్యాప్తంగా పుస్తకాల వ్యాపారం జరుగుతోందని ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రతిరోజు వినతి పత్రాలు అందజేస్తూ పుస్తకాల అమ్మకాన్నీ అడ్డుకుంటున్న విద్యాశాఖ అధికారులు మాత్రం తమకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పుస్తకాలు వ్యాపారాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత విద్యాశాఖ అధికారులు అని , వారు తమ కర్తవ్యం నెరవేర్చాలని కోరారు. ప్రతి పాఠశాలలో ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. పాఠ్యపుస్తకాలు ఎక్కడైనా కొనుక్కోవచ్చు అనే నిబంధనను అందరికీ కనబడేలా పాఠశాల నోటీస్ బోర్డు లో ఉంచాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.