

జనం న్యూస్ జూన్ 03:
నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తాళ్ళరాంపూర్ గ్రామంలో మంగళవారం రోజునా రెవిన్యూ సదస్సు నిర్వహించారు.దీని ఉద్దేశ్యం రైతులకు భూములకు సంబందించిన సమస్య లు ఉంటే రెవెన్యూ సదస్సులో దరఖాస్తులు చేసుకోవడం జరుగుతుంది. సందర్బంగా తహసీల్దార్ మల్లయ్య మాట్లాడుతూ తాళ్లరాంపూర్ లో మా సిబ్బంది తో కలిసి రెవెన్యూ సదస్సు నిర్వహించము. రైతులు మొత్తం డెబ్భై ఎనిమిది మంది దరఖాస్తు లు చేసుకున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమం లో రెవెన్యూ సిబ్బంది రాకేష్, ఆర్ ఐ సదానంద్, కిరణ్, రాజు, సర్వేయర్, తదితరులు, పాల్గొన్నారు.