Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 4 రిపోర్టర్ సలికినీడి నాగరాజు

నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి తరలివచ్చిన వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు కూటమి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేసిన వైస్సార్సీపీ నాయకులు ర్యాలీలో పాల్గొన్నా మాజీ మంత్రి విడదల రజిని జూన్ 4వ తేదీకి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయినా ఇంత వరకు పథకాలు అమలు చేయలేదని,మాజీ మంత్రి విడదల రజిని అన్నారు.వైస్సార్సీపీ ప్రజల పక్షాన నిలబడి ఉందని… కూటమి నేతల మోసల్ని తిప్పి కొడతామని… రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వ తీరు కు వ్యతిరేకంగా పోరాట కార్యక్రమాలు చేపడతామని విడదల రజిని తెలిపారు.నరసరావుపేట రోడ్ లోని రజిని ఇంటి వద్ద నుంచి ఈ ర్యాలీ బయలుదేరి NRT సెంటర్, భాస్కర్ సెంటర్, చౌత్ర, కళామందిర్,గడియార స్తంభం, విశ్వనాద్ సెంటర్ మీదగా తహశీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు.చిలకలూరిపేట తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు.