

మండల అధ్యక్షుడు కలగూర రాజ్ కుమార్
( జనం న్యూస్ 5 జూన్ భీమారం మండల ప్రతినిధికాసిపేట రవి )
భీమారం మండల కేంద్రంలోని గురువారం రోజున బిఆర్ఎస్ మండల అధ్యక్షులు కలగూర రాజకుమార్ ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ కాగ్రెస్ ప్రభుత్వం ఎర్పడి18 నెలలు గడుస్తుంది ఏవోక్కాపని మొదలు పెట్టలేదు ప్రజా పాలన కాదిది… ప్రజలను వంచించే ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తూ ప్రజా పాలన అనడం సిగ్గుచేటు.
.ప్రజా వ్యతిరేక కార్యక్రమాలతో ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారని వెల్లడిచారు .ప్రతిపక్ష పార్టీగా ప్రశ్నిస్తే ప్రత్యక్ష దాడులకు దిగడం సమంజసం కాదని కాంగ్రెస్ నేతలకు హితవు. రాజకీయంలో హుందాతనం ముఖ్యం… రెచ్చగొట్టే వ్యవహారం కాదు .హామీలను మర్చిపోయి ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్నారు .ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తూ ప్రజా పాలన యెట్లా అంటరు లేదర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి 45 వేల ఉద్యోగాలు ఇస్తామని యువతల్లో ఆశసూపి ఓట్లు దండు కున్నారు.నర్సింగాపూర్ ఊర చెరువు చెరువు మత్తడి నిర్మాణాలు చేస్తామని ఏప్రిల్ నెలలో స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మండల నాయకులు కొబ్బరికాయలు కొట్టిఅప్పుడే పూర్తయినట్లు రైతులను భ్రమల్లో ముంచేశారు.బూరుగుపల్లి నుండి దాంపూర్ వరకు రోడ్లశంకుస్థాపనకు కొబ్బరికాయలు కొట్టారు . ఇలా మండల కేంద్రంలో శంకుస్థాపనలకు కొబ్బరికాయలు కుట్టడం తప్ప కొంచెం కూడా పని ముందుకు పోయింది లేదు, .హామీలు అమలు చేయకుండా.. నిరంకుశ నియంతృత పాలన కొనసాగీస్తున్నారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి ఆత్కూరి రాము మాజీ సర్పంచ్ దాసరి మధుమయ్య లాజరు మణిదీప్ చిప్ప పురుషోత్తం వడ్లకొండ పవన్ కార్యకర్తలు పాల్గొన్నారు