

జనం న్యూస్ 5 జూన్ 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్)
ఎల్కతుర్తి మండలంలోని కేశవాపూర్ గ్రామంలో గురువారం జేఏసీ ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలన ర్యాలీ నిర్వహించడం జరిగింది. మహిళా సంఘాల సహకారం తో గ్రామమలో ర్యాలీ నిరాహించి డ్రగ్స్, మత్తు పదార్థాలను వాడవద్దని ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. అనంతరం కవ్వ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి విలువైన జీవితాలను పాడుచేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. సెల్ ఫోన్ లో బెట్టింగ్ ఆప్ ద్వారా డబ్బులు వృధా చేసుకుంటున్నారిని అన్నారు. ఫోన్ లో లోన్ తీసికొని తిరిగి తీర్చాలేక ప్రాణాలు తీసుకుంటున్నారని అన్నారు.యువత పూలె చూపిన మార్గంలో నడవాలని జ్ఞానం వైపు అడుగులు వేసి మార్గదర్శులుగా జీవించాలని అన్నారు. ఈ కార్యక్రమం లో జేఏసీ కన్వీనర్ డేగల సారయ్య,అంబేద్కర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి చెప్యాల, ప్రకాష్,అంబేద్కర్ సంఘము మాజీ జిల్లా అధ్యక్షులు సాతూరి. చంద్రమౌళి తాళ్లపల్లి ప్రభాకర్, జగదీష్,టీపీసీసీ సభ్యులు బొమ్మనపల్లి అశోక్ రెడ్డి, ఈరా రమేష్, భీమ్ రాజ్,మేకల శంకర్, ఇనుగాలా సుధాకర్, సోల్లెటి మంజుల ,పోలు హైమ, ఆరెపల్లి దేవేంద్ర తదితరులు పాల్గొన్నారు.
