Listen to this article

మొక్కలు నాటిన ఎమ్మెల్యే విజయ్ కుమార్

జనం న్యూస్, జూన్05,అచ్యుతాపురం:


పర్యావరణం అంటే మన చుట్టూ ఉండే సహజ వాతావరణాన్ని సూచిస్తుంది.ఇందులో గాలి,నీరు,నేల,వృక్షాలు, జంతువులు,మానవులు ఇలా అన్ని అంశాలు కలిపి ఉంటాయి.పర్యావరణం మన జీవనాధారం అని చెప్పొచ్చు.ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం నారా చంద్రబాబునాయుడు,
డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పర్యావరణని కాపాడండి ప్లాస్టిక్ నిరోధించండి అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం రామన్నపాలెం
ఏపీ గర్ల్స్ రెసిడెన్షియల్ పాఠశాలలో స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పాల్గొని అధికారులు సిబ్బందితో కలసి ప్రతిజ్ఞ చేసి మొక్కలను నాటారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నోరు లేని జీవులు ప్లాస్టిక్ తినవడం వల్ల కొన్ని జీవులు మరణానికి కారణం కావడంతో ప్లాస్టిక్ ను అందరం కలిసి పూర్తిగా నిరోధించడం ఎంతో అవసరమని అన్నారు. అలాగే ప్రతి చోట మొక్కల నాటడం వల్ల ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు,డిపిఓ, ఎంపీడీవో,ఫారెస్ట్ ధికారులు,ఉపాధ్యాయులు,కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.