

జనం న్యూస్ 06జూన్ పెగడపల్లి ప్రతినిధి.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నభూభారతి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు ఈరోజు లింగాపూర్ లో నిర్వహిస్తున్న భూభారతి కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ పాల్గొనిఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో కేసీఆర్ సర్కార్ ధరణి పేరుతో పేదల భూములు దోచుకున్నారని లక్షల దరఖాస్తులు పెండింగ్ లో పెట్టి పేద రైతులకు ఇబ్బందులు గురి చేశారనిభూ సమస్యల పరిష్కారం కోసమే రేవంత్ రెడ్డి ప్రజాపాలన ప్రభుత్వం భూభారతి ఆప్ ను తీసుకొచ్చిందని భూ సమస్యలు ఉన్న రైతులు దరఖాస్తులు చేసుకొని నూతనంగా ప్రవేశపెట్టిన ఆర్వార్ చట్టం ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ లాస్య, సూపరిండెంట్ ఆంజనేయులు ఆర్ఐ జమున రెవెన్యూ సిబ్బంది స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు పూసల తిరుపతి బొడ్డు రమేష్ పలువురు రైతులు పాల్గొన్నారు.