Listen to this article

జనం న్యూస్ : 6 జూన్ శుక్రవారం; సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ :

వివరనాత్మక పరిశోధన చేసినందుకు పలువురు శాస్త్రవేత్తల ప్రశంసలు .వెక్టర్ బోర్న్ వ్యాధులపై ముఖ్య ప్రసంగం చేసిన ప్రొఫెసర్ మాధవి ప్రొఫెసర్ మాధవి కి చైనా, షియాన్ లో అకడెమిక్ ఉత్తమ ధ్రువపత్రాలతో అరుదైన గౌరవం ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపిన ప్రొఫెసర్ మాధవి.సిద్దిపేట ఉస్మానియా యూనివర్సిటీ జువాలజీ విభాగం మాజీ అధిపతి ప్రొఫెసర్ ఎం. మాధవికి, చైనా ఎంటమలాజికల్ సొసైటీ నిర్వహించిన ప్రతిష్టాత్మక కార్యక్రమంలో, ఆమెకు రెండు గౌరవ పత్రాలు ,ప్రశంసాపత్రాలను అందజేశారు . ఈ కార్యక్రమం “ఇంటర్నేషనల్ ఫోరమ్ ఫర్ సర్వేలెన్స్ అండ్ కంట్రోల్ ఆఫ్ మస్కిటోస్ అండ్ వెక్టర్-బోర్న్ డిసీజెస్” పేరుతో మే 26-29, తేదీలలో చైనా దేశంలోని షియాన్ పట్టణంలో నిర్వహించబడింది.మస్కిటోస్ మరియు వెక్టర్-బోర్న్ వ్యాధుల రంగంలో ప్రొఫెసర్ మాధవి చేసిన నిబద్ధతభరిత పరిశోధనలను అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ శాస్త్రవేత్తలు మరియు విశ్రాంత విద్యావేత్తలు గౌరవించారు, ప్రశంసించారు.ఈ అద్భుత వేదికపై ప్రొఫెసర్ మాధవి, మన చారిత్రాత్మక ఉస్మానియా యూనివర్సిటీ యొక్క అద్భుతమైన విద్యా ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తల ముందు సమర్థవంతంగా ప్రదర్శించారు.చైనా ఎంటమలాజికల్ సొసైటీ ఆహ్వానంతో ఆమె “ఎఫెక్ట్స్ ఆఫ్ జింక్ ఆక్సిడ్ నానోపార్టికల్స్ సింతసైస్డ్ ఫ్రమ్ ప్లాంట్ ఎక్సట్రాక్ట్స్ అగైనెస్ట్ డెంగ్యూ అండ్ చికున్ గున్య వెక్టర్, ఎడిస్ ఈజిప్టీ అండ్ ఈజిప్టి ఆల్బోపిక్టస్” అనే అంశంపై ముఖ్య ప్రసంగం అందించారు. అంతేకాక, “వెక్టర్ కంట్రోల్ &ఇన్సెక్టి సైడ్స్ రెసిస్టెన్స్” సెషన్‌కు మోడరేటర్‌గా కూడా ఆమె వ్యవహరించారు .ఈ కార్యక్రమంలో అమెరికా, చైనా, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, గ్రీస్, సింగపూర్, మలేసియా, థాయిలాండ్ వంటి దేశాల నుండి ప్రముఖులు పాల్గొన్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ప్రొఫెసర్ మాధవి ఉస్మానియా యూనివర్సిటీ జువాలజీ శతాబ్ది విభాగంలో జరుగుతున్న పరిశోధనలు, శాస్త్రీయ కార్యకలాపాలను వివరిస్తూ, మల్టీనేషనల్ సహకార పరిశోధనల మరియు అధ్యాపకులు/విద్యార్థుల మార్పిడి కార్యక్రమాల అవకాశాలపై చర్చించారు. ముఖ్యంగా డా. ఫ్లోరెన్స్ ఫౌక్ (డబ్ల్యు.హెచ్. ఓ, జెనీవా), డా. రూయిడ్ జూయ్ (ఫ్లోరిడా, యూ. ఎస్. ఏ.), డా. వూడై (ఎంటమలాజికల్ సొసైటీ ఆఫ్ చైనా, బీజింగ్)లతో ఈ విధంగా అన్వేషణ సాగించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ ఎం. మాధవి, ఉస్మానియా యూనివర్సిటీ గౌరవ ఉపకులపతి ప్రొఫెసర్ ఎం. కుమార్ గారికి, తమ అకడెమిక్ అభివృద్ధికి ఇచ్చిన ప్రోత్సాహానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు..