Listen to this article

జనం న్యూస్; 6 జూన్ శుక్రవారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి

;బక్రీద్ పండుగను పురస్కరించుకుని రుస్తుం ఆర్ట్ గ్యాలరీలో నేడు శుక్రవారం “బక్రీద్ ఖుర్భాని ముబారక్” క్యాన్వాస్ చిత్రాన్ని అంతర్జాతీయ చిత్రకారులు రుస్తుం ఆవిష్కరించారు. పండుగలు సమాజంలో నిస్తేజాన్ని తొలగించి జీవితాలను కళావంతం చేస్తాయి. బక్రీద్ ఈదుల్ జుహ పర్వదినం త్యాగానికి సహనానికి ప్రతీక అనీ పండుగ నాడు ధనవంతులు తమకు కల్గిన సంపదలో బీదలకు రెండున్నర శాతం వస్తురూపేన పంచి అల్లా కృపకు పాత్రులు కావాలని అల్ ఖురాన్ భోదిస్తుందని పండుగ నాడైన బీదవాడు కడుపునిండా తినాలని ఇచ్చే “మహాదానం ఖుర్భాని” అంతర్భావ ముఖ్య ఉద్దేశం. బక్రీద్ ప్రపంచ మానవాళి కి త్యాగం, సహజీవనం, ఐక్యత, శాంతి, సంతోషాలను అందిస్తుందని, అందించాలని ప్రఖ్యాత చిత్రకారులు రుస్తుం అందరికి బక్రీద్ ముబారక్ తెలియజేశారు ఆర్ ఎ ఎఫ్ అధ్యక్షురాలు జులేఖరుస్తుం,అసిస్టెంట్ ప్రొఫెసర్ రుబినారుస్తుం, నైరూప్య చిత్రకారులు నహీంరుస్తుం, ఎం డి రహీం తదితరులు పాల్గొన్నారు.