Listen to this article

జనం న్యూస్ జూన్ 6 కూకట్పల్లి జోన్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి

ఫతేనగర్ డివిజన్ పరిధిలోని ధీన్ దయాలనగర్ కాలనీలో ఘనంగా శ్రీ దుర్గాదేవి దేవాలయ ప్రతిష్ఠా శుభలగ్న మహోత్సవం నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో శోభాయమానంగా ఏర్పాట్లు చేయబడి, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని పూజ కార్యక్రమాలను వీక్షించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు కి కమిటీ సభ్యులు ఘనంగా పూర్ణకుంభ స్వాగతం పలికారు తదనంతరం వారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకులను కలసి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లన్నీ చూసుకోవాలని కమిటీ సభ్యులకు తెలియజేశారు.కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను అభినందిస్తూ భవిష్యత్తులో ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేపట్టాలని రాజేశ్వరరావు కోరారు, వారి ఆహ్వానాన్ని మన్నించి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న రాజేశ్వరరావు నీ ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించగా ఆలయ అర్చకులు వేదాశీర్వచనాము ప్రసాదించారు,ఈ కార్యక్రమంలో ఫతేనగర్ డివిజన్ బిజెపి నాయకులు , కార్యకర్తలు బస్తివాసులు తదితరులు పాల్గొన్నారు.